అవినీతి, నల్లధనంపై ఉమ్మడి పోరాటం : మోదీ
- November 24, 2016
అవినీతి, నల్లధనంపై ఉమ్మడి పోరాటం చేద్దామని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. నల్లధనంపై సామాన్యుడూ సైనికుడిలా పోరాడాలన్నారు. పార్లమెంట్ భవన్‌లో శుక్రవారం జరిగిన 'న్యూ వెర్షన్ ఆఫ్ కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా' పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని 'మేకింగ్ ఆఫ్ కాన్‌స్టిట్యూషన్' పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. యువతలో రాజ్యాంగం పట్ల అవగాహన పెంచేందుకు ప్రత్యేక దినోత్సవం అవసరమని అభిప్రాయపడ్డారు. మన జీవితాల్లో రాజ్యాంగానికి ప్రత్యేక స్థానముందని..రాజ్యాంగాన్ని గుర్తుచేసుకుంటే అంబేడ్కర్‌ను స్మరించుకున్నట్లేనని చెప్పారు. ఆన్‌లైన్ సేవలని విస్తృతంగా వినియోగించుకోవాలని చెప్పారు. వ్యాపార లావాదేవీలన్నీ మొబైల్ ఫోన్‌తోనే చక్కబెట్టుకోవచ్చని చెప్పారు. డిజిటల్ కరెన్సీని విరివిగా వాడుకోవాలన్నారు.
నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు పయనిద్దామన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్‌లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









