కేసీఆర్‌తో ప్రధాని ప్రత్యేక భేటీ
- November 25, 2016
రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అక్కడినుంచి బయల్దేరి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీకి వెళ్లాల్సి ఉండగా.. అలా వెళ్లేందుకు ముందు పది నిమిషాలు ప్రత్యేకంగా వారిద్దరితో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు.
ఆ భేటీ ముగిసిన తర్వాత మాత్రమే మోదీ విమానాశ్రయం నుంచి బయల్దేరి వెళ్లారు. అయితే ఈ సమావేశంలో ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్న విషయం మాత్రం తెలియరాలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవలే ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిసి పెద్దనోట్ల రద్దు తదితర అంశాలపై ఆయనకు సవివరంగా చెప్పిన విషయం తెలిసిందే.ఇప్పుడు కూడా ఆ విషయాలపైనే చర్చించారా.. లేక వేరే ఏవైనా అంశాలు చర్చకు వచ్చాయా అన్న సంగతి మాత్రం తెలియలేదు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







