పాలకూరతో బరువు తగ్గొచ్చు
- August 31, 2015
అతి తక్కువ ధరలో లభించే ఆకుకూర పాలకూర. ధర తక్కువే కానీ దీనితో మన ఆరోగ్యానికి చేసే మేలు చాలా ఎక్కువ. విటమిన్ ఎ అధికంగా లభించే పాలకూర కళ్లకు చాలా మంచిది. దీనిలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. శరీరానికి ఆక్సిజన్ సరఫరా చేసే ఎర్రరక్త పని తీరును సక్రమంగాఉంచేందుకు ఐరన్ ఉపయోగపడుతుంది. పాలకూరలోని పోషకాలు మన శరీరంలోని అనేక రకాల ఇన్ఫెక్షన్ల దాడిని అరికడతాయి. అంతేకాదు పాలకూరను తరచూ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గడంతో పాటు, ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉన్న పదార్ధాలు తీసుకోవాలనే కోరిక తగ్గిపోతుంది. దీనికికారణం పాలకూరలోని థైలకాయిడ్లు. ఈ ధైలకాయిడ్డు కొవ్వు త్వరగా జీర్ణం కాకుండా చూడడం వల్ల తొందరగా ఆకలి అన్పించదు. అంటే కడుపు నిండుగా ఉందన్న ఫీలింగ్ కలిగేలా పాలకూరలోని థైలకాయిడ్లు చేస్తాయి. తద్వారా అనవసరమైన తిండి తినకుండా ఉండగలం. ఆటోమెటిగ్గాఅధిక తిండిని కంట్రోల్ చేసుకుని బరువు కంట్రోల్ చేసుకోగలుగుతాము. ఎముకల ఆరోగ్యానికి తోడ్పడే విటమిన్ కె పాలకూరలోని అత్యధికంగా లభిస్తుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







