క్యూబా విప్లవ యోధుడు, మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో కన్నుమూత
- November 25, 2016
క్యూబా విప్లవ యోధుడు, మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో(90) శనివారం కన్నుమూశారు. 1926 ఆగస్టు 13న బిరాన్‌లోని హోల్గిన్‌లో జన్మించిన ఆయన అసలు పేరు ఫిడెల్ అలెజాండ్రో క్యాస్ట్రో రూజ్. 1959 నుంచి 1976 వరకూ ప్రధానిగా పనిచేసిన ఆయన .. 1976 నుంచి 2008 వరకు క్యూబా అధ్యక్షునిగా దేశానికి మార్గనిర్దేశనం చేశారు. 1959లో ఫుల్జెన్సియో బతిస్టాలో మిలటరీ ఆధిపత్యాన్ని కూలదోసిన క్యాస్ట్రో పాశ్చాత్య దేశాల్లో తొలి కమ్యూనిస్టు దేశాన్ని ఏర్పాటు చేశారు. క్యూబాను దాదాపు 5 దశాబ్దాల పాటు పాలించారు. 2006లో తీవ్ర అనారోగ్యానికి గురవడంతో పార్టీ అధ్యక్ష పదవితో పాటు అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తమ్ముడు రౌల్‌కు బాధ్యతలు అప్పజెప్పారు.
తుది శ్వాస విడిచే వరకూ కమ్యూనిస్టు సిద్ధాంతాల పరిరక్షణ కోసం కృషి చేశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న క్యాస్ట్రో చివరిసారిగా ఏప్రిల్‌లో జరిగిన కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ సభలో ముగింపు ప్రసంగం చేశారు. ' తనకు త్వరలో వయసు 90, నేను మరికొద్ది రోజుల్లో చనిపోబోతున్నానని ముందుగానే ఆయన ప్రకటించారు. అనారోగ్యం బారిన పడిన తర్వాత ఆయన కనిపించకపోవడంతో చాలా సార్లు మరణించారని వార్తలు కూడా వచ్చాయి. అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని బాధ్యతలను సోదరుడు రౌల్‌కు అప్పగించాక ఆయన ఆరు నెలల పాటు ఎవరికీ కనిపించలేదు. 19, జూన్ 2008లో ఆయన వెనెజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌తో మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించాయి.
2014లో చైనా శాంతి బహుమతి
కమ్యూనిస్టు సిద్ధాంతాల కోసం ఎంతో కృషి చేసిన క్యాస్ట్రోకు 2014లో చైనా శాంతి బహుమతి లభించింది. నోబెల్ శాంతి పురస్కారానికి సమాంతరంగా 2010 నుంచి కన్ఫ్యూసియస్ శాంతి బహుమతి పేరుతో ఏటా దీన్ని చైనా అందిస్తోంది. నోబెల్ శాంతి పురస్కారాన్ని మలాలా, కైలాష్ సత్యార్థి స్వీకరించడానికి ఒక రోజు ముందు ఆయన ఈ కన్ఫ్యూసియస్ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







