డిసెంబర్ 30న అల్లరోడి సినిమా..

- November 27, 2016 , by Maagulf
డిసెంబర్ 30న అల్లరోడి సినిమా..

అల్లరోడు నటిస్తున్న చిత్రం 'ఇంట్లో దెయ్యం నాకేం భయం'. పెద్ద నోట్లు రద్దు కావడంతో ఈ సినిమా విడుదల వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ విషయమై క్లారిటీ వచ్చింది. డిసెంబర్ 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఉన్నాడని అంటున్నారు. డిసెంబర్ 9న 'ధృవ', 16న 'ఎస్3' సినిమాలు విడుదల కానుండగా.డిసెంబర్ 23న రామ్ గోపాల్ వర్మ 'వంగవీటి'.. నాని మూవీ 'నేను లోకల్' విడుదలయ్యే అవకాశముండటంతో డిసెంబర్ 30న అల్లరోడి సినిమాని రిలీజ్ చేసి ఈ ఏడాదికి గుడ్ బై చెప్పాలనిభావిస్తున్నాడట.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com