మయన్మార్ సైనికుల అమానుష దాడులు...
- November 28, 2016
మయన్మార్ దేశంలో శరణార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడ శరణార్థ మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. సైనికులు వరుస అత్యాచారాలకు పాల్పడుతుండటంతో వారి కన్నీటి గాథకు అంతం లేకుండా పోతోంది.
'మాపై మయోన్మార్ సైనికులు ఒకరి తర్వాత మరొకరు వరుసబెట్టి అత్యంత క్రూరంగా సామూహిక అత్యాచారం చేశారు. మమ్మల్ని మంచంపై తోసి ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు' అని రోహింగ్యా శరణార్ధ మహిళలు కంటతడిపెట్టారు. మయన్మార్ సైనికుల అమానుష దాడులతో భయభ్రాంతులైన బాధిత మహిళలు తమ ఇళ్లు వదిలి బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని కొండల్లో కోనల్లో ఆకలితో అలమటిస్తూ తలదాచుకున్నారు.
సైనికులు మూకుమ్మడిగా దాడి చేయడంతో తమ సోదరుడు పారిపోగా వారు ఇళ్లను దహనం చేసి తమ అమ్మాయిలపై అత్యాచారం జరిపారని మహిళలు ఆవేదనగా చెప్పారు.
తమ పిల్లలైన బాలికలపై సైనికులు అత్యంత క్రూరంగా అత్యాచారాలు చేశారని మహిళలు చెప్పారు.సైనికుల దాడులతో తాము కిలోమీటర్ల దూరం నడచి సరిహద్దుల్లో తలదాచుకున్నామని వారు పేర్కొన్నారు. యువతులపై సైనికులు అత్యంత అమానుషంగా అత్యాచారాలు చేయడం వల్ల ఎంతోమంది రోహింగ్యా శరణార్ధ మహిళలు భయంతో వణుకుతూ కొండల్లో దుర్భర జీవనం గడుపుతున్నారని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







