పోస్టాఫీసుల్లో జరిగిన నోట్ల మార్పిడి గోల్‌మాల్‌పై సీబీఐ ఫోకస్...
- November 28, 2016
పోస్టాఫీసుల్లో జరిగిన నోట్ల మార్పిడి గోల్‌మాల్‌పై సీబీఐ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించిన ఆధారాలను సేకరించారు. కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు సీబీఐ వరుసగా కేసులు నమోదు చేస్తోంది. హిమాయత్ నగర్ పోస్టాఫీస్ సిబ్బంది అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో వారిపై ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. సూపరెంటిండెంట్ సుధీర్‌బాబు, పోస్ట్ మాస్టర్ రేవతి, డిప్యూటీ పోస్ట్ మాస్టర్ రవితేజలపై కేసులు నమోదయ్యాయి. త్వరలోనే వీరిని అరెస్ట్ చేసే అవకాశముంది.నోట్ల మార్పిడి ఆరోపణలు రావడంతో హైదరాబాద్‌లోని పోస్టాఫీసుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. హిమాయత్‌నగర్, అబిడ్స్‌తో పాటు మరికొన్ని చోట్ల ఈ సోదాలు కొనసాగాయి. ఈ నెల 8 నుంచి జరిగిన లావాదేవీలకు సంబంధించిన రికార్డుల్ని పరిశీలించి... కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొన్నారు. పోస్టాఫీస్ సిబ్బంది కొంతమంది నల్ల కుబేరులతో కుమ్మక్కై భారీగా డబ్బును మార్చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెల 8 నుంచి జరిగిన లావాదేవీలపై సీబీఐ పరిశీలించింది.
హిమాయత్‌నగర్‌లోని పోస్టాఫీసులో 40 లక్షల వరకు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 30 శాతం కమీషన్‌తో డబ్బు మార్చినట్లు సీబీఐ తనిఖీల్లో బయటపడినట్లు తెలుస్తోంది. చాలా పోస్టాఫీసుల్లో సిబ్బంది వేరే మార్గంలో తమకు అవసరమైన వారికి డబ్బు మార్పిడి చేస్తున్న విషయం బయటపడింది. అబిడ్స్ పోస్టాఫీసులోనూ నో క్యాష్ బోర్డును గుర్తించారు. సీబీఐ తనిఖీలతో సిబ్బంది ఈ బోర్డును తీసే ప్రయత్నం చేశారు. అక్రమ నగదు మార్పిడి విషయంలో పర్సెంటేజీపై సిబ్బంది మధ్య విభేదాల వల్లే విషయం బయటకు పొక్కినట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









