నిద్రపట్టట్లేదా.. అయితే లేటుగా తిండి తినడం.. మానేయండి
- November 29, 2016
నిద్రపట్టట్లేదా.. అయితే లేటుగా తిండి తినడం.. మానేయండి. రాత్రి భోజనం లేటుగా తీసుకునే అలవాటుంటే.. వెంటనే మార్చుకోండి. పదికి తర్వాత రాత్రిపూట అన్నం తీసుకుంటే నిద్రలేమి సమస్య తప్పదు. లేటుగా తింటే కడుపులో ఆమ్లాల ఉత్పత్తి పెరిగి, నిద్ర కష్టమవుతుంది. నిద్ర పోవటానికి 2-3 గంటల ముందే భోజనం చేసెయ్యాలి. ఆకలి అనిపిస్తే పడుకోబోయే ముందు ఏదైనా తేలికపాటి చిరుతిండి తినొచ్చు.
అలాగే మద్యం సేవించడం.. శారీరక శ్రమ లేకపోవడం కూడా నిద్రలేమికి కారణం అవుతుంది. పగలు కాఫీ టీలు రెండు మూడు కప్పులకంటే ఎక్కువ తీసుకోకండి. నిద్రపోయేందుకు 2-3 గంటల ముందు నుంచీ వీటిని తాగొద్దు. అలాగే ఒంటికి శ్రమ ఉంటేనే తర్వాత విశ్రాంతి తీసుకోగలుగుతుంది. కాబట్టి రోజూ కొంత వ్యాయామం తప్పనిసరి. రాత్రిపూట శ్రమ ఎక్కువగా ఉండే వ్యాయామం చెయ్యొద్దు.
5. నిద్రపోయే ముందు ఇంట్లో పెద్ద లైట్లు, ధ్వనులు, టీవీ షోస్ వంటివన్నీ బంద్ చెయ్యాలి. పడుకోవటానికి ఓ అరగంట ముందు నుంచీ.. సంగీతం వినటం, పుస్తకం చదవటం వంటి మనసుకు ప్రశాంతతనిచ్చే పనులు చెయ్యాలి. నిద్రించేందుకు 15 నిమిషాల ముందు అరటిపండు, ఓ గ్లాసుడు పాలు తీసుకోవడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం







