టర్కీలోని అదానా ప్రావిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం ..

- November 29, 2016 , by Maagulf
టర్కీలోని అదానా ప్రావిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం ..

టర్కీలోని అదానా ప్రావిన్స్‌లో ఓ వసతిగృహంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అదానాలోని ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఉండే వసతి గృహంలో విద్యుదాఘాతం కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11 మంది బాలికలు సహా వసతిగృహంలో పనిచేసే మరో మహిళ సజీవ దహనమయ్యారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. క్షతగ్రాతులను ఆస్పత్రికి తరలించారు. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com