ప్రయాణీకుడ్ని దోచుకున్న కేసులో ఎయిర్పోర్ట్ పోర్టర్‌కి జైలు
- November 30, 2016
ఉబాయ్: ఎయిర్‌పోర్ట్‌లో పోర్టర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్ష పడింది. ఓ వ్యాపారవేత్తకు చెందిన బ్యాగ్ సేఫ్టీ టేప్‌ని తొలగించి, అందులో ఉన్న 266,000 దిర్హామ్‌లను దోచుకున్న కేసులో నేరం నిరూపణ అమ్యింది. భారతదేశానికి చెందిన వ్యాపారవేత్త, 1.1 మిలియన్ దిర్హామ్‌లతో దుబాయ్‌కి వచ్చారు. ఆ మొత్తంతో బంగారాన్ని కొనుగోలు చేసి, ఎక్స్పోర్ట్ చేయదలచారాయన. 28 ఏళ్ళ బంగ్లాదేశీ పోర్టర్, ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. ఇంకో వైపున 29 ఏళ్ళ ఘనియన్ పోర్టర్ 1,000 దిర్హామ్‌ల జరీమానాకు గురయ్యాడు. దొంగతనానికి సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టిన కేసులో ఈ జరీమానా విధించింది న్యాయస్థానం. కన్వేయర్స్ బెల్ట్ వద్ద లగేజ్‌ని తీసుకుంటున్న క్రమంలో ఓ బ్యాగ్ సీల్ సరిగ్గా లేని విషయాన్ని గుర్తించినట్లు బాధితుడైన వ్యాపారవేత్త తెలిపారు. కస్టమ్స్ వద్దకు వెళ్ళి అక్కడ తాను తీసుకొచ్చిన సొమ్ముపై డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉండగా, తీసుకొచ్చిన సొమ్ములోంచి 286,000 దిర్హామ్‌ల దోపిడీకి గురయినట్లు తెలుసుకున్నానని, వెంటనే పోలీసులకు సమాచారం అందించానని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









