మవసలాత్ ల్యాండ్ మార్క్ ఎచీవ్మెంట్
- November 30, 2016
ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ రీబ్రాండెడ్ వెర్షన్ మవసలాత్, గడచిన ఏడాదిలో 3.6 మిలియన్ల మంది ప్రయాణీకులకు సేవలందించి, సరికొత్త రికార్డుల్ని సృష్టించింది. మవసలాట్ ఐడెంటిటీతో కార్యకలాపాలు గత ఏడాది నవంబర్ 22న ప్రారంభమయ్యాయి. అప్పటినుంచి ఇప్పటిదాకా 3.6 మిలియన్ ప్రయాణీకులకు సేవలందించినట్లు సంస్థ అధికారిక ప్రకటనలో పేర్కొంది. మస్కట్‌లోని రువి - మయెబలా రూట్లో తమ వాహనాలకు అత్యధికంగా రష్ ఉంటోందని సంస్థ వెల్లడించింది. 1,500,00 మందికి పైగా ఈ రూట్లో ప్రయాణీకులకు సంస్థ సేవలందించింది. రువి - వాడి కబిర్ రూట్ తర్వాతి స్థానంలో 800,0000 మంది ప్రయాణీకులతో నిలిచింది. రువి - ముట్రా - కస్ర్ మార్గం ఆ తరువాతి స్థానంలో 300,000 మంది ప్రయాణీకులకు సేవలు అందించింది. రువి - వాడి అదారి రూట్లో 250,000 మంది ప్రయాణీకులు సంస్థ పట్ల ఆకర్షితులయ్యారు. మస్కట్ నుంచి సోహార్ - బురైమి, నిజ్వా - సలాలా, సోహార్ - దుబాయ్ రూట్లకు ఇంటర్సిటీ సర్వీసుల ద్వారా 272,905 మంది ప్రయాణీకుల్ని గమ్యస్థానాలకు చేర్చింది మవసలాత్. నవంబర్ 25న మస్కట్ - దుక్మ్ రూట్లో సేవల్ని ప్రారంభించారు. మవసలాత్ సిఇఓ అహ్మద్ బిన్ అలి అల్ బులైషి మాట్లాడుతూ, సంస్థ వీక్‌డేస్‌లో రోజుకి 10,000 మందికి పైగా ప్రయాణీకులకు సేవలందించేలా, శుక్రవారం 16,000 మందికిపైగా సేవలందించేలా సామర్థ్యాన్ని సంతరించుకుందని చెప్పారు. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో తమ వాహనాలు ప్రయాణీకులకు సేవలందిస్తున్నాయని తెలిపారాయన.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







