బంగారం పై కన్నేసిన సిర్కారు

- December 01, 2016 , by Maagulf
బంగారం పై కన్నేసిన సిర్కారు

కరెన్సీ రద్దు తర్వాత మోదీ నెక్స్ట్ వెపన్ గోల్డ్. జనం దాచుకున్న బంగారాన్ని బయటకిలాగి పన్నులు సంధించాలని మోదీ సర్కారు సంసిద్ధమవుతోంది. ఈ అంశానికి సంబంధించి రకరకాల వార్తలు వస్తుండటంతో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ బంగారం ఎంత ఉండొచ్చనే అంశంపై క్లారిటీ ఇచ్చారు. నగదు మార్పిడిలో భాగంగా కొనుగోలు చేసిన బంగారంపై మాత్రమే పన్ను విధిస్తామని జైట్లీ చెప్పారు. వారసత్వంగా వచ్చిన.. లేదా, లెక్కచూపిన ఆదాయం ద్వారా కొనుగోలు చేసిన బంగారంపై పన్నులేదని అరుణ్‌జైట్లీ తెలిపారు. అంతేకాదు, వివాహిత 500 గ్రాములు, అవివాహిత 250 గ్రాములు, పురుషులు 100 గ్రాముల బంగారం కలిగి ఉండవచ్చని జైట్లీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com