సెన్సార్ పనులు పూర్తిచేసుకున్న 'సప్తగిరి ఎక్స్ ప్రెస్'
- December 01, 2016
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్లు హీరోలుగా వచ్చారు. పాత తరంలో రాజబాబు, పద్మనాభం, చలం లాంటి వారు ఓ వైపు హీరో గా నటిస్తూనే..మరోవైపు కమెడియన్లు గా నటించారు. ఇక బ్రహ్మానందం, ఆలీ లాంటి వారు కూడా హీరోలుగా వచ్చి కమెడియన్లుగా రాణించారు. తాజాగా గత మూడు సంవత్సరాల నుంచి మంచి కమెడియన్ గా రాణించి తాజాగా 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' చిత్రంతో హీరోగా వస్తున్నాడు. త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. ఆ మద్య ఈ చిత్రం ఆడియో రిలీజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ చేతుల మీదుగా జరిగింది. సినిమా ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. 'యు/ఏ' రేటింగ్ తో 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' డిసెంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకి రాబోతుందని నిర్మాత రవికరణ్ తెలిపారు. కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అందరి మనసుకి నచ్చుతుందని చిత్ర యూనిట్ నమ్ముతున్నారు. మరి ఈ సినిమాతో సప్తగిరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







