వెబ్‌సైట్ బ్లాక్‌పై అభియోగాలు
- December 01, 2016
దోహా: ఖతార్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, గల్ఫ్ స్టేట్‌కి సంబంధించిన ప్రముఖ ఇంగ్లీష్ న్యూష్ వెబ్‌సైట్‌ని బ్లాక్ చేసినట్లుగా ఆరోపణలు వినవస్తున్నాయి. దుబాయ్ న్యూస్, గత ఏడాదిలో పలు ఆర్టికల్స్ ప్రచారంలోకి తీసుకురాగా అవి ఖతార్ అధికారిక వర్గాలకు అభ్యంతరంగా కన్పించడం వల్ల ఈ చర్యలు తీసుకున్నారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 24 గంటలనుంచీ వెబ్‌సైట్ బ్లాక్ అయ్యిందని దోహా న్యూస్ వార్గలు వెల్లడించాయి. తమ వెబ్‌సైట్‌కి నెలకు మిలియన్ పాఠకులు ఉన్నారనీ ఆ సంస్థ చెబుతోంది. మీడియా ఫ్రీడమ్‌ని అడ్డుకునే ఇలాంటి చర్యల పట్ల తాము అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది.మొబైల్ ఫోన్లలోనూ, కంప్యూటర్లలోనూ ఈ వెబ్‌సైట్ బ్లాక్ అయ్యింది. ఇదే వెబ్‌సైట్ ఇంకో డొమైన్ నేమ్‌ని తమ రీడర్స్ కోసం రూపొందించినా, దాన్ని కూడా బ్లాక్ చేశారని ఆ సంస్థ ఆరోపిస్తోంది. ఖతార్ సైబర్ క్రైమ్ చట్టంపై రెండు నెలల క్రితం దోహా న్యూస్ తెరపైకి తెచ్చిన కథనం ఈ వివాదానికి కారణంగా భావిస్తున్నారు. అలాగే గడచిన సమ్మర్‌లో ఖతారీ గే మ్యాన్ రాసిన కథనాన్ని కూడా ఈ సంస్థ ప్రచురించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







