'కమ్మ కాపు..' అనే సాంగ్‌ని తొలగిస్తున్నట్లు రామ్‌గోపాల్‌ వర్మ...

- December 02, 2016 , by Maagulf
'కమ్మ కాపు..' అనే సాంగ్‌ని తొలగిస్తున్నట్లు రామ్‌గోపాల్‌ వర్మ...

వర్మ మూవీ 'వంగవీటి' రిలీజ్‌కు అడ్డంకులు తొలిగిపోయాయి. ఇందులోని'కమ్మ కాపు..' అనే సాంగ్‌ని తొలగిస్తున్నట్లు డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మ స్పష్టంచేశాడు. కొందరి సెంటిమెంట్స్‌ను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్మ తన ట్వీట్‌లో తెలిపాడు. భావోద్వేగాలతో కూడిన చిత్రమని, ఎవర్నీ అప్రతిష్ఠపాలు చేయదని వివరణ ఇచ్చుకున్నాడు. విజయవాడలో జరిగిన ఫ్యాక్షన్‌ రాజకీయాల బ్యాక్ డ్రాప్ లో 'వంగవీటి' సినిమా రానుంది.
వాస్తవాలకు విరుద్ధంగా సినిమా చిత్రీకరిస్తున్నారంటూ వంగవీటి మోహనరంగా కొడుకు రాధాకృష్ణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్‌ను తొలగిస్తామని దర్శకుడు కోర్టుకు హామీ ఇవ్వడంతో ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

ఇక శనివారం ఆడియో ఫంక్షన్ విజయవాడలోని కేఎల్‌ విశ్వవిద్యాలయ గ్రౌండ్ లో జరగనుంది. అంతా ఓకే అయితే ఈనెల 23న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com