భారత్-పాకిస్తాన్ మధ్య కొత్త యుద్దానికి తెరలేపిన నోట్ల కొరత
- December 02, 2016
భారత్ పాకిస్తాన్ మధ్య సరికొత్త యుద్ధానికి తెరలేచింది. పెద్దనోట్ల రద్దు ప్రభావం పాకిస్తాన్ హైకమిషన్ దౌత్యాధికారులపైనా పడింది. డాలర్ల కొరత నేపథ్యంలో పాకిస్తాన్ దౌత్యాధికారులకు భారత బ్యాంకులు పరిమితులు విధించాయి. దౌత్యాధికారులకు డాలర్లలో పన్నులేకుండా జీతాలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే భారత్లో 5 వేల డాలర్లకు మించి విత్డ్రా చేయాలంటే... అందుకు తగ్గ కారణాలు చూపుతూ పత్రాలు సమర్పించాలి. 5 వేల డాలర్లకు దిగువన డ్రా చేయాలంటే ఎలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాగా నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల్లో డాలర్ల కొరత తీవ్రంగా ఉంది. దీంతో పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగులకు జీతాల ఖాతాలున్న ఆర్బీఎల్ బ్యాంకు.
ఎన్ని డాలర్లు విత్డ్రా చేయాలన్నా ముందస్తు పత్రాలు సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. లేదా ఎక్స్చేంచ్ ధరలు చెల్లించి భారత కరెన్సీలో జీతాలు తీసుకోవాలనీ అది కూడా రిజర్వుబ్యాంకు నిబంధనల మేరకే విత్డ్రా చేసుకోవాలని తెలిపింది. అదీకాదంటే తమ డబ్బును తిరిగి పాకిస్తాన్ పంపుకోవచ్చునని పేర్కొంది. ఈ మూడు షరతులపైనా పాకిస్తాన్ దౌత్యాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తమకు జీతాల చెల్లింపులో పరిమితులు విధించడం వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని చెబుతూ... తమ దేశంలోని భారత దౌత్యాధికారుల జీతాల చెల్లింపులోనూ ఇదే పరిమితులు విధిస్తామంటున్నారు. కాగా ఈ సమస్యను పరిష్కరించేందుకు సంబంధత సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు భారత విదేశాంగ అధికారులు వెల్లడించారు. డాలర్ల చెల్లింపులో పరిమితులు విధించడంపై పాకిస్తాన్ హైకమిషన్ స్పందిస్తూ. భారత్ కావాలనే పాకిస్తాన్ను లక్ష్యంగా చేసుకుంటున్నట్టు ఆరోపించింది. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగానే తమను ఇబ్బంది పెడుతున్నారనీ.. నోట్లరద్దు కారణమే కాదని పేర్కొంది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









