వారసత్వ సంపదపై దాడులకు దాయిష్‌ కుట్ర

- December 03, 2016 , by Maagulf
వారసత్వ సంపదపై దాడులకు దాయిష్‌ కుట్ర

'ఎమర్జన్సీ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ కల్చరల్‌ హెరిటేజ్‌'పై ప్యానెల్‌ డిస్కషన్‌లో పలువురు వక్తలు, చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణపై ప్రసంగించారు. ఈ సందర్బంగా తీవ్రవాద సంస్థ దాయిష్‌, వారసత్వ సంపదను ధ్వంసం చేయడం, లూటీ చేయడంపై చేసిన ప్రకటనలపై చర్చించడం జరిగింది. 40 దేశాలకు చెందిన ప్రతినిథులు రెండు రోజుల ఈ ఫోరంలో పాల్గొన్నారు. అబుదాబీ టూరిజం మరియు కల్చర్‌ అథారిటీ ఛైర్మన్‌ మొహమ్మద్‌ ఖలీఫా అల్‌ ముబారక్‌, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, యూఏఈ చారిత్రక వారసత్వ సంపదను కాపాడటంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టిందని అన్నారు. ప్రజల్లో అవగాహన పెంచడం, చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపదపై వారికి అవగాహన కల్పించడం ద్వారా దాయిష్‌ దాడుల్ని నియంత్రించవచ్చని వక్తలు అభిప్రాయపడ్డారు. వారసత్వ కట్టడాలు మానవ జాతి సంపద అని వక్తలు పేర్కొన్నారు. మసీదులపై కూడా దాడులు జరుగుతుండడం హేయమనీ, అయితే ఇటువంటి సందర్భాల్లో ప్రజలు తీవ్రవాదులపై తిరగబడుతుండడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సెంటర్‌ చీఫ్‌ - అరబ్‌ ఎమిరేట్స్‌ యూనిట్‌ - నాడా అల్‌ హస్సన్‌ మాట్లాడుతూ, చారిత్రక వారసత్వ సంపదను కాపాడుకోవడంలో ప్రజల్ని భాగస్వాములుగా చెయ్యాలని అన్నారు. యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ఇరినా బోకోవా మాట్లాడుతూ 100 మిలియన్‌ డాలర్ల నిధి, సంస్కృతి పరిరక్షణ, పునర్‌నిర్మాణం, భద్రత, అలాగే ఐక్యత వంటివాటి కోసం వినియోగించబడ్తున్నట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com