అఖిల్‌ని కలిసిన బాలీవుడ్ నటుడు హృతిక్‌

- December 03, 2016 , by Maagulf
అఖిల్‌ని కలిసిన బాలీవుడ్ నటుడు హృతిక్‌

బాలీవుడ్‌ కథానాయకుడు హృతిక్‌ రోషన్‌ అక్కినేని హీరో అఖిల్‌ను కలిశారు. ఈ విషయాన్ని అఖిల్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ.. ఆనందం వ్యక్తం చేశారు. హృతిక్‌ లాంటి సూపర్‌స్టార్‌ని కలవడం ఆనందంగా ఉందని, ఆయన వ్యక్తిత్వం, నటన చాలా బావుంటాయని అన్నారు. మళ్లీ తనను కలవడానికి సమయం తీసుకోండి సర్‌ అంటూ హృతిక్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హృతిక్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు. ఈ ట్వీట్‌కు హృతిక్‌ వెంటనే స్పందించారు. 'ధన్యవాదాలు అఖిల్‌, నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. నాన్నను, కుటుంబ సభ్యులను అడిగానని చెప్పు' అంటూ ట్వీట్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com