ఇరాక్ లో ఉగ్ర దాడి, 24 మంది మృతి
- December 03, 2016
ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడ్డారు. మోసుల్ పట్టణంలోని సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకొని శనివారం దాడి చేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు 24 మందిని హతమార్చినట్లు ప్రెస్ టీవీ వెల్లడించింది. కాగా.. శుక్రవారం ఖయ్యరా ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ జరిపిన రెండు కారు బాంబు దాడుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందగా.. 29 మంది గాయపడిన విషయం తెలిసిందే.
మోసుల్‌కు దక్షిణంగా 60 కిలోమీటర్ల దూరంలో ఉండే ఖయ్యరాను ఇరాకీ సేనలు ఆగస్టు చివర్లో తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అనంతరం ఆపరేషన్ మోసుల్‌ను చేపట్టిన ఇరాకీ సేనలకు ఇస్లామిక్ ఉగ్రవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురౌతుంది. ప్రస్తుతం మోసుల్ ఎయిర్‌పోర్ట్ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరుగుతోందని ఇరాక్‌కు చెందిన అల్మాడా ప్రెస్ వెబ్‌సైట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







