వంగవీటి కుటుంబంతో సమస్యలున్నాయి, కానీ వెనక్కి తగ్గేది లేదు...

- December 03, 2016 , by Maagulf
వంగవీటి కుటుంబంతో సమస్యలున్నాయి, కానీ వెనక్కి తగ్గేది లేదు...

ఆడియో రిలీజ్‌ కోసం ఇవాళ విజయవాడ వచ్చిన వర్మ.. వంగవీటి కుటుంబంతో భేటీ అయ్యారు. వంగవీటి రంగా భార్య రత్నకుమారి, రంగా కుమారుడు రాధాకృష్ణతో సినిమాలోని అంశాలపై చర్చించారు. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

భేటీ ముగిసిన తర్వాత వర్మ తన ట్విట్టర్‌లో సమావేశ వివరాలను ట్వీట్ చేశాడు. కొద్దిసేపటి క్రితమే రంగా కుటుంబ సభ్యులను కలిశానని, భేటీ సంతృప్తికరంగా జరగలేదని ట్వీట్ చేశాడు. సమస్యలున్నాయని, కానీ తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ఏం జరుగుతుందో చూద్దాం అంటూ ట్వీట్ చేశాడు. తాను ఇలాంటి సీరియస్ వార్నింగ్స్‌ చాలా చూశానని, కానీ నవ్వుతూ బెదిరించడం తొలిసారి చూశానని, ఇది చాలా ప్రమాదకరమని.. అయినప్పటికీ వంగవీటి సినిమాపై వెనక్కు తగ్గేదే లేదని స్పష్టం చేశాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com