ముగ్గురు పోలీసులను చంపిన నిందితులకు కఠినశిక్షలు విధించిన కోర్టు

- December 05, 2016 , by Maagulf
ముగ్గురు పోలీసులను చంపిన నిందితులకు కఠినశిక్షలు విధించిన కోర్టు

మనామా: బహ్రేయినీ కోర్టు ముగ్గురికి మరణశిక్ష మరో ఏడుగురికి జీవిత ఖైదుని ఆదివారం విధించింది.ఒక సమూహం జరిపిన బాంబు దాడిలో ఎమిరేట్ పొలిసు అధికారి మరియు ఇద్దరు బహ్రేయినీ పోలీసులను దారుణంగా చంపిన కేసులో వీరు ప్రధాన నిందితులని పోలీసుల మరణానికి ఆ పదిమంది కారణమైనట్లు న్యాయవర్గాలు తెలిపాయి.  మార్చి 2014 లో మనామా గ్రామంలో జరిగిన  ఒక బాంబును పోలీసుల మీదకు విసిరిన ఘటనలో ఒక ఎమిరేట్ అధికారి మరియు  ఇరువురు బహ్రేయినీ పోలీసులు చనిపోయారు. అక్టోబర్ నెలలో ఈ కేసుకు సంబంధించి 10 మంది నిందితులపై పునః విచారణను న్యాయస్థానం  నిర్వహించి వీరిని దోషులుగా నిర్ధారించారు.ఆదివారం కోర్టు వెలువరించిన తుదితీర్పులో ముగ్గురికి మరణశిక్ష మరో ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. అంతేకాక ఈ పదిమంది నిందితుల పౌరసత్వం సైతం రద్దు చేయబడింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com