జయలలిత ఆరోగ్యం అత్యంత విషమం
- December 05, 2016
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. నిన్న సాయంత్రం గుండెపోటుకు గురైన ఆమెకు సీసీయూలో అత్యవసర చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితిపై అపోలో యాజమాన్యం ఈరోజు మధ్యాహ్నం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో అత్యాధునిక పరికరాల సాయంతో జయలలితకు వైద్యసేవలు అందిస్తున్నట్లు అపోలో ఆస్పత్రి పేర్కొంది. కొద్దిసేపటి క్రితమే దిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ వైద్యుల బృందం జయలలితను పరీక్షించిన తర్వాత ఈ హెల్త్ బులెటిన్ విడుదల చేయడం గమనార్హం.
తాజా వార్తలు
- జలీబ్లో ఉక్కుపాదం.. 1,253 మంది అరెస్ట్..!!
- ఒమాన్‌లో ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన కీలక మార్పులు..!!
- అమెరికాలో సౌదీ రక్షణ శాఖ సహాయ మంత్రి..కీలక చర్చలు..!!
- ఘనంగా ప్రారంభమైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు..
- నిబంధనల ఉల్లంఘన.. ట్రావెల్ ఏజెన్సీ మూసివేత..!!
- యూఏఈలో ఈ ఏడాది తొలిసారి 50°C నమోదు..!!
- ఆరు రోజుల్లోనే 38 వేల మంది సందర్శకులు..విశేష ఆదరణ..!!
- వాట్సాప్ అంకుల్స్ పై ఇన్‌స్టా పిల్లలు గెలిచారు: కేటీఆర్
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..







