జయలలిత ఆరోగ్యంపై ఆరాతీస్తున్న వెంకయ్య నాయుడు

- December 05, 2016 , by Maagulf
జయలలిత ఆరోగ్యంపై ఆరాతీస్తున్న వెంకయ్య నాయుడు

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్న నేపథ్యంలో ఆమెకు ఎయిమ్స్‌, అపోలో వైద్యులు వైద్యం అందిస్తున్న నేపథ్యంలో ఆయన ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడి వైద్యులతో మాట్లాడి జయ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్టు సమాచారం.

జయలలిత ఇక లేరని తమిళ మీడియాలో వచ్చిన ప్రకటనల్ని అపోలో ఆస్పత్రి కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి ఆవరణలో ఉన్న అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు.ఆస్పత్రిపైనా, అక్కడి అధికారుల వాహనాలను సైతం వారు ధ్వంసం చేశారు. తమ 'అమ్మ' ఆరోగ్యంపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ రోదిస్తున్నారు. ఆస్పత్రిలోకి దూసుకెళ్లేందుకు అభిమానులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని కట్టడిచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com