కువైట్‌లో విజిట్ వీసాతో రెసిడెన్సీ పర్మిట్..KD150..!!
- August 02, 2026
కువైట్ : విజిట్ వీసాను సాధారణ రెసిడెన్సీ పర్మిట్‌గా మార్చుకునే విదేశీయులకు 150 కువైటీ దినార్ (KD150) ఫీజును కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Interior) నిర్ణయించింది. ఈ మేరకు విదేశీయుల నివాస చట్టం అమలు నిబంధనల్లో సవరణలు చేసింది.
సవరించిన నిబంధనల ప్రకారం. ఆర్టికల్-39లోని తొమ్మిదో పేరాలో కొత్తగా క్లాజ్-4ను చేర్చారు. దీని ప్రకారం ఆర్టికల్-16 నిబంధనల కింద విజిట్ వీసాను సాధారణ రెసిడెన్సీ పర్మిట్‌గా మార్చుకునే సేవకు KD150 స్థిర ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, డొమెస్టిక్ వర్కర్లు మరియు వారికి సమానమైన కేటగిరీలకు ఈ ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. ఆర్టికల్-20 ప్రకారం వీరు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఈ నిర్ణయాన్ని తమ పరిధిలో వెంటనే అమలు చేయాలని సంబంధిత అధికారులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అధికారిక గెజిట్‌లో ప్రచురితమైన తేదీ నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







