జయలలిత ఆరోగ్యంపై ఆరాతీస్తున్న వెంకయ్య నాయుడు
- December 05, 2016
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్న నేపథ్యంలో ఆమెకు ఎయిమ్స్, అపోలో వైద్యులు వైద్యం అందిస్తున్న నేపథ్యంలో ఆయన ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడి వైద్యులతో మాట్లాడి జయ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్టు సమాచారం.
జయలలిత ఇక లేరని తమిళ మీడియాలో వచ్చిన ప్రకటనల్ని అపోలో ఆస్పత్రి కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి ఆవరణలో ఉన్న అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు.ఆస్పత్రిపైనా, అక్కడి అధికారుల వాహనాలను సైతం వారు ధ్వంసం చేశారు. తమ 'అమ్మ' ఆరోగ్యంపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ రోదిస్తున్నారు. ఆస్పత్రిలోకి దూసుకెళ్లేందుకు అభిమానులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని కట్టడిచేశారు.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







