జయలలితకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం నివాళులర్పించారు

- December 06, 2016 , by Maagulf
జయలలితకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం  నివాళులర్పించారు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. విజయవాడ నుంచి చెన్నై చేరుకున్న ఆయన రాజాజీ హాల్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచిన జయలలిత పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ రోజు సాయంత్రం జరిగే జయ అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.
మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు జయలలితకు నివాళులర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com