ఫ్రాన్స్‌ ప్రధానిగా బెర్నార్డ్‌ కజెనూవ్‌

- December 06, 2016 , by Maagulf
ఫ్రాన్స్‌ ప్రధానిగా బెర్నార్డ్‌ కజెనూవ్‌

ఫ్రాన్స్‌ ప్రధానమంత్రిగా బెర్నార్డ్‌ కజెనూవ్‌ను నియమిస్తున్నట్లు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హొలాండే మంగళవారం ప్రకటించారు. బెర్నార్డ్‌ ప్రస్తుతం ఫ్రాన్స్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఫ్రాన్స్‌ ప్రధాని మాన్యుల్‌ వాల్స్‌ తన పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో బెర్నార్డ్‌ను నియమిస్తున్నట్లు వెల్లడించారు. 2017లో జరగనున్న ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ తరపు నుంచి మాన్యుల్‌ బరిలో దిగుతుండటం వల్లే ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. బెర్నార్డ్‌కు బలమైన వ్యక్తిత్వముందని, దేశ వ్యవహారాల్లో అనుభవముందని అందుకే ఆయనను ప్రధానిగా నియమిస్తున్నట్లు హొలాండే కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com