'చిరు' డ్యాన్స్..
- December 07, 2016
సంవత్సరాల తరువాత 'చిరు' మేకప్ వేసుకుని 'ఖైదీ నెంబర్ 150' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో ఆయన ఎలాంటి ఫైట్లు..ఎలాంటి డ్యాన్స్ వేశారోనని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారంట..దీనికి తోడు సోషల్ మాధ్యమాల్లో ఈ చిత్రానికి సంబంధించిన పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో వార్త తిరుగుతోంది. ఓ పాటకు డ్యాన్స్ వెరైటీగా ఉండాలని 'చరణ్' చెప్పడంతో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ వెరైటీ డ్యాన్స్ ను పరిచయం చేస్తున్నాడంట. ఈ పాటను 'మౌలిన్ రోజ్' శైలిలో తెరెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
పేరొందిన నైట్ క్లబ్..
'మౌలిన్ రోజ్' అనేది పారిస్ లో నృత్యాలకు పేరొందిన నైట్ క్లబ్. మరో వారం రోజుల్లో ఈ పాట చిత్రీకరణ పూర్తవుతుందని టాక్. ఈ పాట చిత్రానికే హైలెట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది. త్వరలోనే చిత్ర టీజర్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరిలో సినిమా రిలీజ్ అవుతుందన్న విషయం తెలిసిందే. మెగా వారసుడు 'రామ్ చరణ్' నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ సూపర్ హిట్టు 'కత్తి'కి రీమేక్ గా తెరకెక్కుతోంది. 'వినాయక్' డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో 'చిరంజీవి' పక్కన 'కాజల్' హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్ డ్రామాకి మేసేజ్ ని జోడించి ఈ మూవీని వెరీ ఇంట్రెస్ట్ గా వినాయక్ మలుస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







