ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న 'ఓం నమో వెంకటేశాయ'
- December 08, 2016
అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వస్తున్న 'ఓం నమో వెంకటేశాయ' చిత్రం రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ఎ. మహేష్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ''అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్‌లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నాగార్జున కెరీర్‌లోనే హయ్యస్ట్ బిజినెస్ జరుగుతోంది. ఓవర్సీస్ రైట్స్‌లో, శాటిలైట్ రైట్స్‌లో, ఇక్కడ అన్ని ఏరియాల్లో క్రేజీగా బిజినెస్ జరుగుతోంది. రాబోయే సినిమాల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న సినిమా 'ఓం నమో వేంకటేశాయ'.
ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం గ్రాఫిక్ వర్క్ జరుగుతోంది. ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అని నిర్మాత పేర్కొన్నారు. అక్కినేని నాగార్జున హాథీరామ్ బాబాగా చేస్తున్న ఈ చిత్రంలో వేంకటేశ్వరస్వామిగా సౌరబ్‌జైన్, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క కనిపించనుంది.
జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్, విమలా రామన్, రావు రమేష్, వెన్నెల కిషోర్, ప్రభాకర్, రఘుబాబు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందిస్తున్న ఈ చిత్రానికి స్వరవాణి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్.గోపాల్‌రెడ్డి, జె.కె.భారవి, కిరణ్‌కుమార్ మన్నె, గౌతంరాజు ఇతర సాంకేతిక వర్గం.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







