చెన్నైలో మళ్లీ పెద్ద ఎత్తున సొమ్ము బయటపడింది
- December 09, 2016
టీటీడీ పాలకమండలి సభ్యుడు శేఖర్ రెడ్డి వద్ద రూ.90 కోట్లు బయటపడిన వైనం మరువక ముందే... చెన్నైలో మళ్లీ పెద్ద ఎత్తున సొమ్ము బయటపడింది. ఆదాయపన్నుఅధికారులు శుక్రవారం పలుచోట్ల నిర్వహించిన సోదాల్లో రూ.106 కోట్ల నగదుతో పాటు 127 కేజీల బంగారం పట్టుబడింది. ఇందులో రూ.10 కోట్ల మేర కొత్త నోట్లు కూడా ఉండడం విశేషం. ఒక్కోటి కిలో బరువున్న 127 బంగారపు కడ్డీలు, రూ.96 కోట్ల పాత కరెన్సీ నోట్లు, రూ.10 కోట్ల మేర రూ.2000 కొత్తనోట్లు తమ సోదాల్లో బయటపడినట్టు ఐటీ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇటీవల ఆదాయపన్ను అధికారులకు ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము పట్టుబడడం ఇదే తొలిసారి. శేఖర్ రెడ్డి సహా మరికొందరి కార్యకలాపాలపై నిఘా అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఐటీ శాఖ విస్తృత సోదాలు నిర్వహిస్తోంది.కాగా పట్టుబడిన కొత్త కరెన్సీకి సంబంధించి కనీసం బ్యాంకు రసీదులు కూడా లేకపోవడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కరెన్సీ మార్పిడి కోసం కొందరు సిండికేట్‌గా ఏర్పడినట్టు సమాచారం రావడంతో అధికారులు మొత్తం ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







