మహేష్ కొత్త సినిమా టైటిల్ 'సంభవామి'

- December 10, 2016 , by Maagulf
మహేష్ కొత్త సినిమా టైటిల్ 'సంభవామి'

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తమిళ టాప్ డైరెక్టర్ మురుగదాస్‌తో భారీ బడ్జెట్ మూవీ కోసం పనిచేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాని వేసవికాలంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా టైటిల్ విషయంలో అటు చిత్ర బృందంలోనూ, ఇటు అభిమానుల్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా కోసం 'వాస్కోడిగామా', 'ఏజెంట్ శివ' వంటి పలు పేర్లను అనుకున్నారు. అయితే, ఈ టైటిళ్ల విషయంలో అభిమానులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే, ఈ సినిమా టైటిల్‌లో 'శివ' పదం ఉండాలని అటు దర్శకుడు, ఇటు హీరో గట్టిగా పట్టుబడుతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

అయితే, ఎట్టకేలకు ఆ గందరగోళానికి తెర దించుతూ.. ఈ సినిమాకు మరో కొత్త టైటిల్ పెట్టాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు టాలీవుడ్‌లో పలు రూమర్లు చక్కలు కొడుతున్నాయి. ఆ టైటిల్ ఏంటంటే.. 'సంభవామి'. వింటుంటేనే 'అరె.. భలే ఉందే' అనిపిస్తోంది కదా. ఈ సంగతి చిన్నగా టాలీవుడ్ చేరడంతో.. టైటిల్ బాగుందంటూ..చెవులు కొరుక్కుంటున్నారు సినీ జనాలు. కాగా, ఈ టైటిల్‌ను మహేశ్ కోసం ఫిల్మ్ చాంబర్‌లో నమోదు చేయించినట్లు ప్రముఖ జర్నలిస్ట్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి రెండు భాషల్లోనూ ఒకే టైటిల్ పెట్టాలని మురుగదాస్ ఆలోచిస్తున్నాడు. దానిలో భాగంగానే..ఈ టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com