కెన్యాలో దుర్ఘటన ...

- December 10, 2016 , by Maagulf
కెన్యాలో దుర్ఘటన ...

పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలిపోవడంతో 30మంది సజీవదహనమైన ఘటన కెన్యాలో చోటుచేసుకుంది. నైరోబి-నైవిషా రహదారిపై వెళ్తున్న ట్యాంకర్‌ అదే ప్రాంతంలో ముందు వెళ్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. అనంతరం మంటలు వ్యాపించడంతో 30 మంది మంటల్లో కాలిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 11 మంది వాహనాలు కూడా దహనమయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కెన్యాలో దేశవ్యాప్తంగా వైద్యుల నిరసన జరుగుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com