డైనమైట్ : రివ్యూ
- September 04, 2015
తెలుగులో ఫెరఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్స్ తక్కువనే చెప్పాలి. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాల తరహాలో మొదటి సీన్ నుంచి కథలోకి వెళ్తూ...ఒక్కో ట్విస్ట్ రివీల్ చేసుకుంటూ యాక్షన్ మోతాదు పెంచేవి పూర్తిగా అరుదు. అయితే అలాంటి థ్రిల్లర్ ని తెలుగుకు అందించాలని దర్శకుడు దేవకట్టా ఫిక్సయ్యినట్లున్నాడు. మంచు విష్ణుతో కలిసి తమిళ చిత్రం 'అరీమా నంబి 'చిత్రం ని మన నేటివిటికు మార్చి అందించారు. ఫస్టాఫ్ ఫాస్ట్ పేసెడ్ గా నడిచి, సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ దాకా రేసిగానే నడిచింది. అక్కడ నుంచి రొటీన్ గా, ప్రెడిక్టుబుల్ గా మారింది. ఫోర్స్ డ్ గా ప్లేస్ మెంట్ లేని చోట సాంగ్స్ పెట్టడం, కామెడీ రిలీఫ్ లేకపోవటం, హింస ఎక్కువ ఉండటం వంటివి ఉన్నా ఓ కొత్త తరహా చిత్రం అందించాలనే దర్శకుడు, విష్ణు ప్రయత్నం ముందు అవి చిన్నబోతాయి.మీ టికెట్స్ ను వెంటనే బుక్ చేసుకోండి! భాధ్యతగల పౌరుడుగా అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే ఈ తరం కుర్రాడుశివాజీకృష్ణ అలియాస్ శివ(మంచు విష్ణు). అతను ఓ రోజు రోడ్డుమీద ఓ అమ్మాయిని పోకిరీలనుంచి రక్షించి, అనామిక దాసరి(ప్రణీత)దృష్టిలో పడతాడు. ఆమె చాలా ఇంప్రెస్ అయ్యి...అతనితో ప్రేమలో పడుతుంది. ఇద్దరూ తర్వాత రెస్టారెంట్ లో కలుసుకుని, ఆమె ప్లాట్ కు వెళతారు. అక్కడ ఆమె రిఫ్రెష్ అవుతున్నప్పుడు ఆమె కిడ్నాప్ కు గురి అవుతుంది. వెంటనే ఎలర్టైన శివ..వెంటనే పోలీసులుకు ఇన్ ఫార్మ్ చేసినా ఫలితం లేకపోవటంతో తనే రంగంలోకి దిగి ఆమెను వెతకటం మొదలెడతాడు. ఆ క్రమంలో ఆమె ఛానెల్ 24 సీఈవో రంగనాధ్ దాసరి (పరుచూరి వెంకటేశ్వరరావు)కూతురు అని తెలుస్తుంది. ఆమె ఇంటికి వెళ్లి ఆమె తండ్రిని విషయం ఏంటి అని అడుగుదామనుకునేలోపు ఆయన హత్యకు గురి అవుతాడు. అక్కడ కొన్ని విషయాలు రివీల్ అవుతాయి. అసలు ఈ కిడ్నాప్ కు, ఆమె తండ్రి హత్యకు అసలు కారణమేంటి..దీనికి యూనియన్ మినిస్టర్ రిషిదేవ్ (జెడి చక్రవర్తి) కి సంభంధం ఏమిటి... ఎలా ఈ విషయాలన్నీ సామాన్యుడైన శివ ఇన్విస్టిగేట్ చేసి తెలుసుకుని, ఆమెను ఎలా రక్షించాడు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. బ్యానర్: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం నటీనటులు: మంచు విష్ణు, ప్రణీత, జెడి చక్రవర్తి, తదితరులు కెమెరా: సతీశ్ ముత్యాల, సంగీతం: అచ్చు, ఆర్ట్: రఘు కులకర్ణి, ఫైట్స్: విజయ్ మాస్టర్ ఎడిటర్: ఎస్.ఆర్ శేఖర్. సమర్పణ: అరియానా, విరియానా డైలాగ్స్: బి.వి.ఎస్.రవి, సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి, పోతుల రవికిరణ్. స్క్రీన్ ప్లే, దర్శకత్వం : దేవ కట్టా నిర్మాత : మంచు విష్ణు రెగ్యులర్ కమర్షియల్ చిత్రంలా కాకుండా ఓ విభిన్నమైన ధ్రిల్లర్ చిత్రం చూడాలి అనుకునే వారికి ఈ చిత్రం మంచి ఎక్సపీరియన్స్ ఇస్తుందనటంలో సందేహం లేదు.
మాగల్ఫ్.కామ్ రేటింగ్ 2.5/5
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







