తెలుగు వారిని నయవంచన చేస్తున్న భారత్ కేంద్ర ప్రభుత్వం
- September 04, 2015
ఆరాటం తీరాలంటే పోరాటాలే చెయ్యాలా..? చంద్రబాబుది మధ్యే మార్గమా? రావాల్సిన ప్రత్యేక హోదా రాదని తేలిపోయింది. రోడ్డు మ్యాపులేసి గీసిన గీతలే మళ్ళీ మళ్ళీ గీసి అరిగిపోయిన గ్రాంఫోను రికార్డుల్ని మోగిస్తున్న కేంద్రం మీద ఆశలు వదిలేసుకోవాలని చెప్పక తప్పదు. కావాల్సింది నిధులేగా...ఏ రాయైతేనేం పళ్ళూడ గొట్టుకోవడానికని అనుకోవడానికి వీల్లేదు! ఆ బీహారుకు మోడీ ప్రకటించిన లక్షాపాతికవేల కోట్లు ఎన్నికల ముందు చేసిన వాగ్దానం అని ఎందుకనుకోకూడదు? నోటి మాటే కదా..అక్కడ బీజేపీ గెల్చినా అంతంత డబ్బు ఇస్తాడన్న గ్యారెంటీ లేదు. మరేం చెయ్యాలి..చంద్రబాబు కింకర్తవ్యం ఏంటి..? అసలే కులరాజకీయాలు,ముఠాతగాదాలు,కాంట్రాక్టర్ల కుమ్ములాటలతో కునారిల్లుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే..ఏం చెయ్యాలి..జవాబు జనం నుంచి రావాలి.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







