ఒమన్, ఇండియా మధ్య వీక్లీ ఎయిర్‌లైన్ సీట్ కోటా ఒప్పందం
- December 14, 2016
ఇండియన్ సెక్టార్ నుంచి ఒమన్ ఎదురుచూస్తోన్న ఎయిర్‌లైన్ సీట్స్ కోటాకి సంబంధించి తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ యావియేషన్ (పిఎసిఎ), ఇండియాతో చేసుకున్న ఒప్పందం ద్వారా వారానికి సీట్ల కోటా సంఖ్య 6,260గా ఉంటుంది. ఇంటర్నేషనల్ సివిల్ యావియేషన్ ఆర్గనైజేషన్ (ఐఎసిఓ) తొమ్మిదవ ఎయిర్ సర్వీసెస్ నెగోసియేషన్స్ ఈవెంట్‌లో పాల్గొంది. డిసెంబర్ 5 నుంచి 9 వరకు జరిగిన ఈ ఈవెంట్‌లో సౌదీ అరేబియా, కెన్యా, టాంజానియా, ఘనా, బహమాస్, కరాకావోలతోపాటు ఇండియాతోనూ ఎయిర్ కనెక్టివిటీని పెంచుకునేందుకు పలు ఒప్పందాలు చేసుకుంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ మరియు సలాలా ఎయిర్‌పోర్ట్ మధ్య ఎన్ని కార్గో విమానాలు అయినా తిరిగేందుకు వీలుగా ఓ ఒప్పందం ఆస్ట్రేలియాతో కుదుర్చుకుంది ఒమన్. ఈ ఒప్పందాలు, ఒమన్‌కీ ఇతర దేశాలకీ మధ్య సన్నిహిత సంబంధాల్ని ఇంకా పెంచుతాయని పిఎసిఎ సిఇఓ డాక్టర్ మొహమ్మద్ బిన్ నాజర్ చెప్పారు. ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందంతో వీక్లీ సీట్ల కోటా సంఖ్య 27,405కి పెరుగుతుంది. అలాగే జెడ్డాకి వారానికి ఏడు అదనపు విమానాల్ని నడిపేందుకు ఒప్పందం కుదిరింది. ఘనాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మధ్య 14 వీక్లీ విమానాలు అదనంగా వచ్చి చేరతాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







