'ఓం నమో వెంకటేశాయ' లో ప్రతినాయకుడిగా జగపతి బాబు
- December 14, 2016
ఫ్యామిలీ హీరో ట్యాగ్ ని తగిలించుకొని కొన్నాళ్ళు తన హవాని నడిపించిన జగపతి బాబు ప్రస్తుతం ప్రతినాయకుడి పాత్రలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. లెజెండ్ సినిమాలో విలన్ గా నటించిన జగపతి బాబుకి ప్రస్తుతం కాల్షీట్స్ ఏ మాత్రం ఖాళీగా లేవు. మరి అంతగా బిజీ అయ్యాడు అప్పటి హీరో. కేవలం తెలుగు సినిమాలలోనే కాదు తమిళం, కన్నడ భాషలలోను జగపతి బాబు హవా నడుస్తోంది. ఇక ఇప్పుడు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కిస్తోన్న భక్తి రస చిత్రంలోను జగపతి బాబు ఓ కామియో రోల్ పాత్ర పోషించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. కృష్ణమ్మ భక్తురాలు అనుష్క పై మనసుపడే మహరాజు పాత్రలో జగపతి బాబు నటించనున్నాడని చెబుతున్నారు. మహారాజు పాత్రలో జగపతి బాబు చాలా గొప్పగా కనిపించనున్నాడని చెబుతున్నారు.
ఇప్పటికే జగపతి బాబు, అనుష్క లపై ఓ సాంగ్ ని కూడా చిత్రీకరించినట్టు చిత్ర యూనిట్ పేర్కొంది. హథీరాం బాబా జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓం నమో వెంకటేశాయ చిత్రంలో సౌరభ్ జైన్ వెంకటేశ్వర స్వామిగా కనిపించనుండగా.. విమలా రామన్, ప్రజ్ఞా జైస్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 10న ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకురావాలని యూనిట్ భావిస్తోంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







