విడాకులు తీసుకుంటున్న మీరా జాస్మిన్
- December 14, 2016
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రేమ వివాహాలు చేసుకున్న వారే ఉన్నారు. అందులో అతి కొద్ది మంది మాత్రమే అన్యోన్యంగా జీవిస్తున్నారు. చాలా మంది వరకు మద్యలోనే విభేదాలు వచ్చి విడిపోయారు. ఆ మద్య ప్రేమ వివాహం చేసుకున్న మళియాల బ్యూటీ అమలాపాల్ సంవత్సరంలోపే విడాకులు తీసుకున్నారు. ఇక తెలుగులో తమిళ డబ్బింగ్ చిత్రం 'రన్' తో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ మీరా జాస్మిన్. తర్వాత పవన్ కళ్యాన్ తో 'గుడుంబ శంకర్', రవితేజ సరసన 'భద్ర' చిత్రాలతో అచ్చం తెలుగింటి అమ్మాయిగా అభిమానుల మనసు గెలుచుకుంది.
ఆ తర్వాత కొన్ని సినిమాలు వచ్చినా పెద్దగా విజయాలు సాధించలేదు. 2014లో అనూహ్యంగా దుబాయ్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్‌ను పెళ్లాడి కొంత కాలం దుబాయ్ లో భర్తతో కాపురం చేసిన ఈ అమ్మడు ఇప్పుడు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.
భర్తతో ఏడాది పాటు విభేదాలు తలెత్తడంతో విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పెద్దల సమక్షంలో పెళ్ళి చేసుకున్న మీరా దుబాయ్ లో సెటిల్ అయ్యింది.. ఇటీవల 'పతూ కల్పనకల్' అనే చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఈ మద్య మీడియాతో మాట్లాడిన మీరా జాస్మిన్ తన నిర్ణయాల పట్ల సంతోషంగా ఉన్నానని తెలిపింది. సినీ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ వందశాతం సంతోషంగా ఉన్నానని మీరా జాస్మిన్ వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







