కువైట్ లో విలవిల్లాడిపోతున్న తెలుగు కార్మికులు
- December 14, 2016
కువైట్లోని ప్రముఖ నిర్మాణ కంపెనీల్లో ఒకటైన ఖరాఫీ నేషనల్ కంపెనీ కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వ కుండా వేధింపులకు గురిచేస్తోంది. ఈ కంపె నీలోని వివిధ క్యాంపుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులు దాదాపు రెండు వేల మం ది పనిచేస్తున్నారు. రెండు సంవత్సరాలుగా రెండు, మూడు నెలలకు ఒకసారి వేతనాలు తీసుకుంటూ సర్దుబాటు చేసుకున్న కార్మికు లకు తాజాగా కంపెనీ మొండి చెయ్యి చూపింది. ఐదు నెలల నుంచి కార్మికులకు వేతనాలు చెల్లించడంలేదని కంపెనీలో సైట్ ఇన్చార్జిగా పనిచేస్తున్న నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం ఏర్గట్ల వాసి మచ్చ శ్రీని వాస్ తెలిపారు.
ఐదు నెలల నుంచి వేతనాలు చెల్లించకపోయినా పని విషయంలో కఠినంగానే వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ ఇళ్లకు వెళ్లిపోతామంటే అను మతి ఇవ్వడం లేదు. నెలల తరబడి వేతనం చెల్లించకపోవడంతో ఇంటి వద్ద చేసిన అప్పు లు తీర్చడం ఎలా అని కార్మికులు ప్రశ్నిస్తు న్నారు. ఒక్కో కార్మికునికి రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు కంపెనీ యాజమాన్యం వేత నం చెల్లించాల్సి ఉంది. విదేశాంగ శాఖ స్పందించి ఖరాఫీ నేషనల్ కంపెనీ యాజమా న్యంతో చర్చించి కార్మికుల సమస్యను పరి ష్కరించాలని పలువురు కోరుతున్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









