కొర్రల పాయసం
- December 14, 2016
కావలసిన పదార్థాలు: కొర్రలు - 1 కప్పు, శనగపప్పు - పావు కప్పు, పాలు - అర లీటరు, పచ్చి కర్జూరం - 1 కప్పు, జీడిపప్పు, ఎండుద్రాక్ష - పావుకప్పు, యాలకుల పొడి - అర టీ స్పూను, తేనె - ఒక టీ స్పూను, నెయ్యి - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం: కొన్ని నీళ్లు చిలకరించి కర్జూరాన్ని పేస్టులా చేసుకుని పక్కనుంచాలి. కొర్రల్ని దోరగా వేగించి, శనగపప్పుతో పాటు 3 కప్పులు నీరు పోసి 3 విజిల్స్ వచ్చేవరకు కుక్కర్లో ఉడికించాలి. చల్లారిన తర్వాత పాలు, కర్జూరం పేస్టు కలిపి చిన్నమంటపై బుడగలు వచ్చేవరకు ఉంచాలి. తర్వాత సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని నేతిలో వేగించిన జీడిపప్పు, కిస్‌మిస్‌లతో అలంకరించి, యాలకుల పొడి, తేనె చల్లి వేడి వేడిగా తినాలి.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







