ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో విశాఖ యువకుడి మృతి
- December 15, 2016
విశాఖ నగరానికి చెందిన ఓ యువకుడి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో మృతిచెందాడు. నగరంలోని మురళీనగర్‌కు చెందిన అనుదీప్ గతేడాది ఎంఎస్ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు. నిన్న సాయంత్రం నలుగురు స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లి.. అక్కడ స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ మృతిచెందాడు. అనుదీప్ మృతి సమాచారం ఈరోజు ఉదయం తల్లిదండ్రులకు అందడంతో వారు విషాదంలో ముగినిపోయారు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడవుతాడనుకున్న ఒక్కగానొక్క కుమారుడు అర్ధాంతరంగా మృత్యువాత పడ్డాడంటూ వారు రోదిస్తున్నారు. భారత ప్రభుత్వం దీనిపై స్పందించి అనుదీప్ మృతదేహం స్వదేశానికి తీసుకొచ్చేందుకు సహకరించాలని బంధువులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







