విమాన ప్రయాణీకులకు తీపి కబురు!
- December 15, 2016
విమానం ప్రయాణం అంటే లగేజీ స్కానింగ్..హ్యాండ్ బ్యాగుల సెక్యూరిటీ తనిఖీలు ఓ పెద్ద తతంగం. అయితే ఇక విమాన ప్రయాణీకుల హ్యాండ్ బ్యాగుల స్టాంపింగ్, ట్యాగింగ్ సమస్యలకు ఇక శుభం కార్డు పడినట్టే. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ బ్యూరో ఒక కొత్త పైలట్ ప్రాజెక్టు కు శ్రీకారం చుట్టింది.
దేశవ్యాప్తంగా విమానాశ్రయాల పూర్తి భద్రతను నిర్వహించే సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో (బీసీఏఎస్) అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చెకింగ్ వ్యవస్థను గురువారం ప్రారంభించింది. హై రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలు, సంబంధిత ఇతర టెక్నాలజీతో సహాయంతో హ్యాండ్ బ్యాగుల తనిఖీని మరింత కట్టుదిట్టంగా చేపట్టనున్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోలకతా, అహ్మదాబాద్ విమానాశ్రయాల్లో ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్ట్) ఈ ప్రక్రియను మొదలు పెట్టింది.
ఈ ప్రాజెక్టు విజయవంతమైతే ఈ పద్ధతిని అన్ని విమానాశ్రయాల్లో ప్రారంభించనున్నట్టు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
సామాను భద్రత, స్క్రీనింగ్ సౌకర్యాన్ని బలోపేతం చేయడానికి, ప్రయాణీకులకు హ్యాండ్ బ్యాగు టాగ్స్ , స్టాంపింగ్ కష్టాలను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ పద్థతిని అవలంబిస్తున్నట్టు చెప్పింది. బాధ్యత బీసీఏఎస్ ది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









