ఆర్టీసీలో ప్రయాణికులకు శుభవార్త.!
- December 16, 2016
ప్రయాణికుల్ని ఆకర్షించిన వెనుకసీట్ల రాయితీకి ఏపీఎస్‌ఆర్టీసీ మంగళం పాడింది. బస్సుల్లో చివరి రెండు వరుస సీట్లకు టికెట్‌పై ఇస్తున్న 20 శాతం రాయితీని ఎత్తేసింది. ఇతర సీట్లలో మాదిరిగానే వీటికీ పూర్తిస్థాయి ఛార్జీ వసూలుచేస్తోంది. బస్సులో ఖాళీగా ఉంటున్న సీట్ల భర్తీకోసం ఏపీఎస్‌ఆర్టీసీ ఏప్రిల్‌లో కొత్త పథకం ప్రవేశపెట్టింది. వెనుకసీట్లలో కూర్చోవడానికి ప్రయాణికులు ఆసక్తి చూపించడం లేదని గుర్తించి.. ఆఖరి రెండు వరుసల్లో ముందస్తుగా టికెట్ తీసుకునేవారికి బేసిక్ ధరపై 20 శాతం రాయితీని ప్రకటించింది. కానీ కొద్దిరోజుల క్రితం చడీచప్పుడు లేకుండా వెనుకసీట్ల రాయితీని ఆర్టీసీ అధికారులు ఎత్తేశారు.
అన్ని సీట్లకూ ఒకే రకమైన ఛార్జీని వసూలుచేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావించగా.. ఈ రాయితీని ప్రయాణికులు పెద్దగా ఉపయోగించుకోవడం లేదని.. వారి నుంచి డిమాండ్ లేకపోవడంతో 20 శాతం తగ్గింపును తొలగించామని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు 'ఈనాడు'తో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







