కార్తితో తమిళంలో జతకట్టనున్న రకుల్‌ ప్రీత్

- December 16, 2016 , by Maagulf
కార్తితో తమిళంలో జతకట్టనున్న రకుల్‌ ప్రీత్

తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది రకుల్‌ ప్రీత్‌సింగ్‌. మహేష్‌బాబు, జూ॥ ఎన్టీఆర్‌, రాంచరణ్‌లతో పాటు పలువురు అగ్రహీరోలతో ఆడి పాడింది. కొన్ని నెలల క్రితం విశాల్‌ హీరోగా నటిస్తున్న 'తుప్పరివాలన్‌' చిత్రంలో నటించేందుకు దర్శకుడు సంప్రదించగా తెలుగులో బిజీగా ఉన్న కారణంతో నటించలేదు. ఈ నేపథ్యంలో ఆమె తమిళ చిత్ర పరిశ్రమపై దృష్టి సారించింది. విశాల్‌కు నో చెప్పిన ఈ పసిడిమేని ఛాయల చిన్నది కార్తి సరసన నటించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కార్తి ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలోని 'కాట్రు వెళియిడై' చిత్రంలో నటిస్తున్నారు.

ఆ తర్వాత 'చదురంగ వేట్టె' ఫేమ్‌ వినోద్‌ దర్శకత్వంలోని చిత్రంలో నటిస్తారు. ఈ చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్స్‌ బ్యానరుపై ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మిస్తారు. ఇందులోనే కార్తి సరసన రకుల్‌ను ఎంచుకున్నారు. కథ విన్న వెంటనే రకుల్‌ కూడా నటించేందుకు అంగీకరించిదని చెబుతున్నారు.దీంతో జనవరి నుంచి చిత్రీకరణ ఆరంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com