పాక్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కమిషన్ వార్నింగ్
- December 16, 2016
నిషేధించిన టెర్రరిస్టు గ్రూపులతో సంబంధాలను కలిగివుండటంపై ఆ దేశ సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిషన్ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని విమర్శించింది. ఈ మేరకు పాక్ జాతీయ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. క్వెట్టాలో బాంబు దాడుల తర్వాత విచారణకు పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఓ కమిషన్ ను నియమించింది. దాడులపై విచారణ జరిపిన కమిషన్ బృందం 110 పేజీల రిపోర్టును పాక్ అత్యున్నత న్యాయస్ధానానికి అందించింది. రిపోర్టుల్లో పాకిస్తాన్ ప్రభుత్వ వక్రబుద్ధిని ఎండగట్టింది. యాంటీ టెర్రరిజం యాక్టు(ఏటీఏ)ను కేవలం మాటల్లో కాకుండా.. ఆచరణలో పెట్టాలని సూచించింది. దీంతో భారత్ లాంటి దేశాలు పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోందని పేర్కొంటున్న వ్యాఖ్యలు నిజమేనని వెల్లడైంది.
ఒకవేళ పాకిస్తాన్ మిలటరీ వ్యవస్ధను అనుసరించాలనుకుంటే రాజ్యాంగంలో మార్పులు చేయాలని పేర్కొంది. నిషేధించిన సంస్ధలైన సిఫా-ఐ-సహబా పాకిస్తాన్, మిలత్-ఐ-ఇస్లామియా, అహ్లే సున్నత్ వాల్ జమాత్ లకు పాకిస్తాన్ హోం శాఖ మంత్రి హెడ్ గా ఉండటంతో ఆయన్ను కలవడానికి కమిషన్ తిరస్కరించింది. ఏటీఏను దేశం మొత్తం పాటించాలని కమిషన్ కోరింది. నిషేధిత జాబితాలో ఉన్న సంస్ధల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలని అంది. టెర్రరిస్టు ఆర్గనైజేషన్లు సమావేశాలను నిర్వహించకుండా అడ్డుకోవాలని చెప్పింది.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు









