హెచ్1 బీ వీసాల మోసం

- December 17, 2016 , by Maagulf
హెచ్1 బీ వీసాల మోసం

హెచ్1 బీ వీసాల మోసం కేసులో హైదరాబాద్ చెందిన టెక్కీ హరి కర్నె అడ్డంగా దొరికిపోయాడు. నిందితుడిగా తేలడంతో న్యాయస్థానం త్వరలో శిక్ష ఖరారు చేయనుంది. అమెరికా కోర్టు నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, 2.50 లక్షల డాలర్ల జరిమానా విధించే ఛాన్స్ వుందని ప్రాసిక్యూటర్ తెలిపారు. నగరానికి చెందిన 32 ఏళ్ల హరి.. యూఎస్‌లో వుంటున్నాడు. కొందరు ఐటీ నిపుణులను ఉద్యోగంలోకి తీసుకుని వాళ్లకి ఎస్‌సీఎం సిస్టమ్స్‌లో హెచ్‌1బీ వీసాలను ఇప్పించారు.

వీసాలకు దరఖాస్తు చేసేటప్పుడు వాళ్లకి పూర్తిస్థాయి ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నామని, ఏడాది వేతనాలు ఇస్తామంటూ మభ్యపెట్టాడట హరి. కానీ అలా చేయకుండా.. ఉద్యోగంలోకి తీసుకున్న వాళ్లని మూడో పార్టీకి అప్పగించారు. తర్వాత వీళ్లు సదరు కంపెనీల్లో ఉద్యోగుల పేరిట నకిలీ పే రోల్స్‌ సృష్టించారు. అంతేకాదు జీతాలు ఇవ్వని రోజుల్లో నకిలీ సెలవు పత్రాలను క్రియేట్ చేశాడు. చివరకు ఈ తతంగమంటూ అమెరికా కార్మికశాఖ తనిఖీల్లో బట్టబయలయ్యింది. దీంతో ఎస్‌సీఎం ప్రైవేట్‌ లిమిటెడ్‌లో యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ మేనేజర్‌గా పని చేస్తున్న హరిని అరెస్ట్ చేసి న్యాయస్థానంకి అప్పగించారు.తాను తప్పు చేసినట్టు నిందితుడు కోర్టులో అంగీకరించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com