వేలిముద్ర సాయంతో విమానాశ్రయాల్లోకి ప్రవేశించొచ్చు
- December 17, 2016
విమాన ప్రయాణికులకు మరో శుభవార్త. ఇప్పటి వరకు విమానాశ్రయంలోకి ప్రవేశించాలంటే టికెట్‌తో పాటు సంబంధిత గుర్తింపు పత్రాలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక్కోసారి అవి మర్చిపోతే ఇక అంతేసంగతులు. ఇకపై ఇటువంటి బాధలకు స్వస్తి పలకనుంది విమానయాన శాఖ. ఇకపై ఎటువంటి పత్రాలూ లేకుండా కేవలం వేలిముద్ర సాయంతో విమానాశ్రయాల్లోకి ప్రవేశించొచ్చు. ఈ విధానం అమలుపై విమానయాన శాఖ అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే దీన్ని హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.ఇప్పటి వరకు దేశంలో 100 కోట్ల మందికి ఆధార్ కార్డులను జారీ చేశారు. ఆ సమయంలో వేలిముద్రలతో పాటు, ఐరిస్ స్కాన్స్‌ను తీసుకున్నారు. వాటిని ఇప్పటికే నేషనల్ డిజిటల్ రిజిస్ట్రీకి పంపారు. అయితే, ఇకపై విమాన టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఆధార్ వివరాలను నమోదు చేసుకుంటారు. దీంతో విమానాశ్రయాల్లో కేవలం వేలిముద్ర వేయడం ద్వారా లోపలికి ప్రవేశించే వీలుంటుంది. అయితే దేశీయ విమానాల్లో ప్రయాణించేందుకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని, విదేశీ విమనాల్లో ప్రయాణించాలంటే పాస్‌పోర్టు తప్పనిసరిగా కలిగి ఉండాలని విమానయానశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.హైదరాబాద్‌లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు సత్ఫలితాలు ఇస్తుండడంతో రానున్న రోజుల్లో దిల్లీ, ముంబయి, బెంగళూరు విమానాశ్రయాల్లో అమలు చేయనున్నట్లు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గురుప్రసాద్ మహాపాత్ర తెలిపారు.
తాజా వార్తలు
- విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు
- అబుదాబిలో కార్మికుల నివాస పరిస్థితులపై మానవ హక్కుల సంస్థ క్షేత్రస్థాయి పరిశీలన
- సౌదీ విమానాశ్రయాలపై హౌతీ దాడులు.. ముగ్గురు మృతి, 36 మందికి గాయాలు
- ఇక వాట్సాప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికెట్
- దుబాయ్‌లో ప్రాంతాల వారీగా రంగులతో కొత్త స్ట్రీట్ సూచికలు
- విద్యార్థులే వికసిత్ భారత్ నిర్మాణ శిల్పులు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- రేపు సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
- రియాద్‌కు ఉత్తరంగా హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ కూల్చివేత..!!
- వికలాంగులు, వృద్ధులకు ఆర్థిక సేవలు.. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ కీలక ఆదేశాలు..!!
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్‌పై కొత్త నిబంధనలు..!!







