13 మంది సైనికుల మృతి
- December 17, 2016
బాంబు పేలుళ్లతో టర్కీ మరోసారి ఉలిక్కిపడింది. టర్కీ సైనిక సిబ్బందిని తీసుకువెళ్తున్న బస్సును పేలుడు పదార్థాలు ఉన్న కారు ఢీ కొట్టడంతో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 13 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, 48 మంది గాయపడినట్లు టర్కీ సైన్యం వెల్లడించింది. క్యాసేరిలోని ఎరసైయెస్ యూనివర్సిటీ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్సులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. పేలుడు ధాటికి బస్సు పూర్తిగా ధ్వంసమైంది. సైనికులను తీసుకెళ్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకొనే ఈ కారు బాంబు దాడికి పాల్పడినట్లు టర్కీ ఉప ప్రధాని వెసి క్యానక్ తెలిపారు. దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు.గత వారం టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో కుర్దిష్ మిలిటెంట్లు జరిపిన దాడిలో 44 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడి జరిగిన వారం వ్యవధిలోనే మరో దాడి జరగడం గమనార్హం.
తాజా వార్తలు
- విద్యార్థులే వికసిత్ భారత్ నిర్మాణ శిల్పులు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- రేపు సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
- రియాద్‌కు ఉత్తరంగా హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ కూల్చివేత..!!
- వికలాంగులు, వృద్ధులకు ఆర్థిక సేవలు.. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ కీలక ఆదేశాలు..!!
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో ‘పేమెంట్ లింక్’ సేవకు త్వరలో ముగింపు..!!
- బైక్ చోరీ కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్ష..!!
- కింగ్ ఖలీద్ విమానాశ్రయం పై బాలిస్టిక్ క్షిపణితో హూతీల దాడి
- చీటింగ్ చేస్తే ఇక వెంటనే చర్యలు లేవు.. IIT బాంబే కొత్త రూల్స్
- ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హృదయపూర్వక శుభాకాంక్షలు







