బహ్రెయిన్ రాజధానికై నూతన ప్రణాళికలు

- September 05, 2015 , by Maagulf
బహ్రెయిన్ రాజధానికై నూతన ప్రణాళికలు

శాసన సభ కాలవ్యవధి ముగిసి,   దేశంలో పరిపాలక సంస్థలు కొత్త టర్మ్ లోకి ప్రవేశిస్తున్న నేపధ్యంలో, కొత్త ప్రోజక్టులు, మునిసిపల్ అతిక్రమణలపై కఠిన చర్యలు, ఈసారి అజెండాలో ముఖ్యపాత్ర నిర్వహించనున్నాయి. రద్దీగా ఉన్న ప్రాంతాలలో పాదచరులకు వంతెనలు నిర్మించడం, కేపిటల్ గవర్నరేట్ లో తీరప్రాంతాలను అభివృద్ధి చేయడం వంటి కొత్త పధకాలు ద కేపిటల్ ట్రస్టీస్ బోర్డ్ వారి పరిశీలనలో ఉన్నాయి. సంస్థ ఛైర్మన్ - మొహ్మెడ్ అల్ ఖోజాయీ, సెప్టెంబర్ 16న జరగబోయే బోర్డు మొదటి సమావేశంలోగా ప్రోజక్టులను గురించి చర్చించి, కమిటీలను ఏర్పాటు చేయడానికి  ఈ సమావేశాలు జరుపుతున్నామని వెల్లడించారు. ఇంకా ట్రాఫిక్ చిహ్నాలు, సూచికలపై స్టీక్కర్లను అంటించడం, వీధి కుక్కలు మరియు ఇతర జంతువులు వంటి అనేక సమస్యలు కూడా చర్చకు రానున్నాయి.


--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com