తెలుగుతేజం పీవీ సింధు పరాజయం పాలైంది
- December 17, 2016
బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ సెమీస్‌లో ఒలింపిక్ రజత పతక విజేత, తెలుగుతేజం పీవీ సింధు పరాజయం పాలైంది. దక్షిణ కొరియాకు చెందిన సంగ్ హ్యూన్ 21-15, 18-21, 21-15 తేడాతో సింధూపై గెలిచి ఫైనల్‌ల్లోకి దూసుకెళ్లింది.
మ్యాచ్ సాంతం హోరాహోరీగా సాగింది. తొలి గేమ్‌లో ఆధిక్యం పదేపదే చేతులు మారింది. నువ్వానేనా అన్నట్లు సాగిన గేమ్‌లో సంగ్‌హ్యూన్.. సింధును కోర్టుకు ఇరువైపులా తిప్పించి 21-15తో విజయం పొందింది. అయితే కీలకమైన రెండో గేమ్‌లో సింధు పుంజుకొంది. 10-10, 14-14, 18-18తో సమం చేస్తూ ప్రత్యర్థి ప్రతిఘటించినా అద్భుత స్మాష్‌లతో 21-18తో రెండో గేమ్ గెలుచుకొంది.
మూడో గేమ్‌లోనూ ఇద్దరూ పోటాపోటీగా ఆడినా సింధు కొన్ని అనవసర తప్పిదాలు చేయడంతో హ్యూన్ 21-15తో మ్యాచ్ గెలిచి ఫైనల్‌కు చేరుకొంది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









