రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 22న నగరానికి రాక
- December 17, 2016
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 22న నగరానికి వచ్చి 31 వరకు బొల్లారం రాష్ట్రపతి నిలయంలో పది రోజుల పాటు బస చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి నిలయాన్ని అడుగడుగున భద్రతా దళాలు మోహరించాయి. అధికారులు రాష్ట్రపతి నిలయంలోని ఆరు భవనాలను వెలుపల ఉన్న 14 భవనాలను, పరిసర ప్రాంతాలు తదితర ఏర్పాట్లపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం రాష్ట్రపతి నిలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని భద్రతా చర్యలో భాగంగా ప్రత్యేక ఎన్‌క్లోజర్లను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రపతి విడిది చేసే ఈ పది రోజులు హకీంపేట్ ఎయిర్ పోర్స్ - బొల్లారం - సికింద్రాబాద్‌ల మధ్య ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ప్రణబ్ ముఖర్జీ విడిది సందర్భంగా హకీంపేట ఎయిర్స్ స్టేషన్ నుంచి రాష్ట్రపతి నిలయం వరకు శనివారం రూట్ కాన్వా య్ (రక్షణ పరమైన) రిహార్సల్స్ నిర్వహించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిలియా, బాలానగర్ జోన్ డీసీపీ సాయి శేఖర్, పేట్ బషీరాబాద్ ఏసీపీ శ్రీనివా్‌సరావు, అల్వాల్ ఎస్‌హెచ్‌వో ఆనంద్ రెడ్డి ఈ రిహార్సల్స్ పరిశీలించారు. ఆర్మీ డెంటల్ కాలేజీ స్నాతకోత్సవానికి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నట్టు కాలేజీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 23న నిర్వహిం చేస్నాతకోత్సవంలో భాగంగా రాష్ట్రపతి చేతుల మీదుగా డిగ్రీలు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన
- జాతీయ రహదారి పనులపై ఎంపీ బాలశౌరి సమీక్ష
- ‘దాదా’- మైసూరులో షూటింగ్ పునః ప్రారంభించిన బాలకృష్ణ
- విజయవాడ ఉత్సవ్–2026కు తమిళనాడు ముఖ్యమంత్రికి ఆహ్వానం
- యూఏఈ-భారత్ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తిరుమలలో ఈ నెల 11 నుంచి 20 వరకు వీఐపీ దర్శనాలు రద్దు
- ఫోన్ స్కామ్‌తో Dh11.8 మిలియన్ మోసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన దుబాయ్ పోలీసులు
- ఒమన్ సమీపంలో ట్యాంకర్‌పై దాడి..12 మందికి గాయాలు
- రాహుల్ గాంధీ, ప్రియాంకను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2026కు యూఏఈలో శ్రీకారం







